కావలసిన పదార్థాలు : మటన్ కీమా... పావు కేజీ కూరగాయల ముక్కలు... పావు కేజీ పసుపు... అర టీ. కారం... పావు టీ. పచ్చిమిర్చి... మూడు జీరాపొడి... అర టీ. అల్లంపేస్ట్... ఒక టీ. కొత్తిమీర తరుగు... అర కప్పు వెల్లుల్లి పేస్ట్... ఒక టీ. నిమ్మరసం... ఒక టీ. నూనె... రెండు టీ. ఉప్పు... సరిపడా
పిండి ముద్ద కోసం మైదా... 125 గ్రా. నెయ్యి... రెండు టీ. పెరుగు... ఒక టీ. ఉప్పు... తగినంత
తయారీ విధానం : మటన్ కీమాలో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టులు కలిపి తగినంత నీరు చేర్చి మెత్తబడేదాకా ఉడికించాలి. కడాయిలో కొత్తిమీర, పచ్చిమిర్చి, జీరాపొడి వేసి వేగాక కైమా వేసి నీరంతా ఆవిరయ్యేదాకా వేయించి దించి చల్లార్చి, అందులో నిమ్మరసం పిండాలి.
రోల్ చేసేందుకు అరగంటముందుగానే తడిపి ఫ్రిజ్‌లో ఉంచిన పిండిముద్దను తీసుకుని సమాన భాగాలుగా చేసి చపాతీల్లాగా వత్తాలి. వాటి మద్యలో వేయించి కీమా మిశ్రమాన్ని పెట్టి రోల్ చేసి అంచుల్ని ఒత్తాలి. తర్వాత వీటిని మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి దోరగా వేయించి టొమోటో సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఓవెన్ లేనివారు నూనెలో దోరగా వేయించి తినవచ్చు.