జాలీ డే విత్ "మష్రూమ్‌ కుర్‌కురే"

కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు
చిక్కటి పాలు.. 25 గ్రా.
జున్ను.. 25 గ్రా.
ఎర్ర, పసుపు, గ్రీన్ క్యాప్సికమ్‌లు.. తలా పది గ్రా.
పచ్చిమిరపకాయలు.. 5 గ్రా.
అల్లం.. 5 గ్రా.
ఉప్పు.. తగినంత
నల్ల మిరియాల పొడి.. 2 గ్రా.
మొక్కజొన్న పిండి.. 150 గ్రా.
మైదా.. 50 గ్రా.
జిలకర్ర.. 50 గ్రా.
నీళ్లు.. వంద మి. లీ.
నూనె.. 300 మి. లీ.

తయారీ విధానం :
పుట్టగొడుగులను శుభ్రం చేసుకోవాలి. వీటికి అన్నిరకాల క్యాప్సికమ్ ముక్కలు, అల్లం, జున్ను, పచ్చిమిరకాయలను కలుపుకోవాలి. మొక్కజొన్న పిండిలో మైదా పిండిని కలిపి కాసిన్ని నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దకు కూరగాయలు, పుట్టగొడుగుల మిశ్రమాన్ని కలపాలి.

ఇప్పుడు బాణలిలో నూనె పోసి బాగా మరుగుతుండగా.. పుట్టగొడుగుల మిశ్రమాన్ని వేసి పకోడీల మాదిరిగా దోరగా వేయించి తీసేయాలి. అంతే మష్రూమ్ కుర్‌కురే సిద్ధం..! వీటిని వేడి వేడిగా పుదీనా సాస్‌తో కలిపితే మస్త్ టేస్టీగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి