టేస్టీ అండ్ హెల్దీ "మెకరోని సలాడ్"

కావలసిన పదార్థాలు :
మెకరోని.. ఒక కప్పు
క్యారెట్.. ఒక కప్పు
బీన్స్.. పావు కప్పు
కీరదోస.. ఒకటి
బాదంపప్పు ముక్కలు.. కాసిన్ని
పెరుగు.. వంద గ్రా.
కొత్తిమీర.. రెండు టీ.
ఉప్పు.. సరిపడా
పచ్చిమిర్చి.. ఒకటి
గరంమసాలా.. అర టీ.

తయారీ విధానం :
మెకరోనీ (అన్ని డిపార్ట్‌మెంట్ స్టోర్లలో దొరుకుతుంది)ని ఉడికించి చల్లార్చాలి. క్యారెట్, బీన్స్, కీరదోస, పచ్చిమిర్చిలను సన్నగా తరగాలి. వెన్నశాతం ఎక్కువగా పాలను తీసుకుని పెరుగు చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్‌ను తీసుకుని పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన మెకరోనీని కూడా వేసి కలియబెట్టి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన మెకరోని సలాడ్ సిద్ధం..!

వెబ్దునియా పై చదవండి