కావలసిన పదార్థాలు : లీన్ ఫిష్.. 500 గ్రా. ఉల్లికాడల ముక్కలు.. 2 టీ. పచ్చిమిర్చి ముక్కలు.. ఒక టీ. అల్లం పేస్టు.. పావు టీ. మైదా.. ఒక కప్పు ఉప్పు, పెప్పర్.. రుచికి సరిపడా
తయారీ విధానం : చేపలు తప్ప మిగిలిన వస్తువులన్నింటినీ ఒక గిన్నెలో వేసి సరిపడా నీరు పోసి పేస్టులాగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్క చేప ముక్కను ఆ పేస్టులో ముంచి తీసి కాగే నూనెలో వేసి ఎర్ర వేయించుకోవాలి.
తరువాత ఆ ముక్కలను తీసి ప్లేట్లలో అందంగా సర్దాలి. టొమోటో కెచెప్‌లో చిల్లీ సాస్ కలిపి, చేపల ముక్కలతో వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే డీప్ ఫ్రైడ్ ఫిష్ సిద్ధమైనట్లే..!