ఫ్రైడ్ వెజిటబుల్స్ విత్ "థాయ్‌ వెజ్‌ స్టార్టర్"

కావలసిన పదార్థాలు :
బీన్స్‌, క్యాప్సికమ్‌, క్యారెట్‌, బేబీకార్న్‌, క్యాబేజీ.. అన్నీ కలిపి అర కేజీ
నూడుల్స్‌.. 100గ్రా
మైదా.. 50గ్రా.
కార్న్‌ఫ్లోర్‌.. 100గ్రా.
పండుమిర్చిముద్ద.. ఒక టీ.
తులసి ఆకులు.. 2 టీ.
సోయాసాస్.. ఒక టీ.
వెనిగర్.. ఒక టీ.పచ్చిమిర్చి.. 6
టమోటో సాస్.. ఒక టీ.
కొత్తిమీర తురుము.. ఒక టీ.
అజినమోటో.. చిటికెడు
ఉప్పు.. తగినంత
నూనె.. సరిపడా

తయారీ విధానం :
కూరగాయల్ని సన్నగా పొడవుగా కోయాలి. ఓ గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, పండుమిర్చి ముద్ద, ఉప్పు వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముక్కలకు పట్టించి పక్కన ఉంచాలి. ఓ గంట తరువాత ఒక బాణలిలో నూనె పోసి ఈ కూరగాయల ముక్కలను కరకరలాడేవరకూ వేయించి తీయాలి. అలాగే నూడుల్స్‌ను కూడా వేయించి తీయాలి.

ఇప్పుడు ఓ నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని అందులో ఒక టీస్పూను నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, తులసి ఆకులు, టొమాటోసాస్‌, వెనిగర్‌, సోయాసాస్‌, అజినమోటో వేసి కలుపుతూ వేయించాలి. ఆపై వేయించిన కూరగాయ ముక్కలు వేసి పొడిపొడి అయ్యేలా వేయించాలి. చివరగా వాటిమీద వేయించిన నూడుల్స్‌, కొత్తిమీర చల్లి అలంకరించి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి