రక్తహీనతకు చెక్ పెట్టే "ఫిల్లింగ్ రోటీలు"

FILE
కావలసిన పదార్థాలు :
మైదా లేదా గోధుమపిండి.. మూడు కప్పులు
వెన్న.. రెండు టీ.
ఉప్పు... అర టీ.
బేకింగ్ పౌడర్... అర టీ.
గోరువెచ్చటి పాలు.. కాసిన్ని

ఫిల్లింగ్ కోసం..
ఉల్లికాడలు.. కాసిన్ని
క్యారెట్ తురుము.. రెండు కప్పులు
ఛీజ్ తురుము.. ఒక కప్పు
నూనె.. తగినంత
ఉప్పు.. సరిపడా
మిరియాలపొడి.. కాస్తంత

ఫిల్లింగ్ చేయాలంటే... ఉల్లికాడల్ని సన్నగా తరిగి.. వెడల్పాటి గిన్నెలో క్యారెట్ తురుము, ఉల్లికాడ ముక్కలు, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలిపి ఉంచుకోవాలి.

తయారీ విధానం :
పిండిలో వెన్న, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో నెమ్మదిగా పాలు పోస్తూ పిండిని మృదువుగా కలపాలి. దాన్ని పావుగంటసేపు మూతపెట్టి ఉంచాలి. పిండిని నాలుగు భాగాలుగా విభజించి, పల్చటి రొట్టెల మాదిరిగా నలుచదరంగా వత్తాలి. ఒక్కో రొట్టె సగంమీద ఫిల్లింగ్ మిశ్రమాన్ని ఉంచి సమంగా పరవాలి. పైన ఛీజ్ తురుము, మిరియాలపొడి చల్లి.. మిగతా సగంతో మూసేసి అంచుల్ని నొక్కాలి.

అలా మొత్తం రొట్టెలన్నింటినీ చేసుకున్న తరువాత పెనంపై కొద్దిగా నూనె వేసి రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే ఫిల్లింగ్ రోటీలు రెడీ అయినట్లే..! వీటిలో ఉండే... క్యారెట్‌, ఛీజ్‌లలో ఉండే "ఏ" విటమిన్, "బీ కాంప్లెక్స్" విటమిన్లు కళ్లకు ఎంతగానో మేలు చేస్తాయి. రక్తహీనతకు కూడా పోగొడతాయి.

వెబ్దునియా పై చదవండి