కావలసిన పదార్థాలు : నూడుల్స్ ప్యాకెట్... రెండు శాండ్విచ్ బ్రెడ్... పది స్లైసులు ఉల్లిపాయలు... రెండు గరంమసాలా... రెండు టీ. పచ్చిబఠానీలు... రెండు టీ. కార్న్‌ఫ్లోర్... రెండు టీ. క్యారెట్ తురుము... రెండు టీ. టొమోటో కెచప్... రెండు టీ. నూనె... సరిపడా ఉప్పు... తగినంత కారం... ఒక టీ.
తయారీ విధానం : ముందుగా నూడుల్స్‌లో కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి ఉడికించి వడబోయాలి. బ్రెడ్ స్లయిస్ల అంచులు కత్తిరించి ఉంచాలి. ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిబఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, గరంమసాలా వేసి వేయించాలి. అందులోనే ఉప్పు, కారం వేసి కాసేపటి తరువాత ఉడికించి వడబోసిన నూడుల్స్‌ను వేసి కలియదిప్పాలి.
ఈ మిశ్రమం చల్లారాక బ్రెడ్పీసులను నీటిలో అద్ది అరచేతి మధ్యలో పెట్టి నీరు వడిగిపోయేలా వత్తాలి. బ్రెడ్ స్లయిస్ మధ్యలో నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టి కోడిగుడ్డు ఆకారంలో చేసుకోవాలి. వీటిని కార్న్‌ఫ్లోర్ అద్ది కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చాక తీసేయాలి. వీటిని ప్లేటులో అందంగా సర్ది, పైన క్యారెట్ తురుము చల్లి, టొమోటో కెచప్‌తో సర్వ్ చేయాలి.