మసాలా తయారీకి.. బంగాళాదుంపలు.. పావు కి. బఠాణీ.. అర కప్పు క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ తరుగు.. రెండు కప్పులు అల్లం, మిర్చి పేస్ట్.. రెండు టీ. గరంమసాలా.. 1 టీ. నిమ్మకాయ.. ఒకటి ఉప్పు, పసుపు.. సరిపడా కొత్తిమీర.. కొద్దిగా ఉల్లి, అల్లం, మిర్చి, క్యాప్సికమ్ తరుగులు.. ఒక కప్పు
తయారీ విధానం : బాణలిలో నూనెను పోసి మరిగించి అందులో మిర్చి, అల్లం, ఉల్లి, క్యాప్సికమ్ ముక్కలను వేసి బాగా వేయించాలి. ఉడికించిన వెజిటేబుల్స్‌ను అందులో చేర్చి నీరు ఇరిగి పోయేంతవరకు వేపాలి. వేగిన పదార్థానికి ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి నిమ్మరసం పోసి కొత్తిమీర చల్లి కలిపి దింపాలి.
రెండు బ్రెడ్ ముక్కలు తీసుకుని నీటిలో ముంచి వెంటనే తీసి వాటి మధ్య మిశ్రమాన్ని పెట్టి అంచులు తడిచేసి అతికించాలి. బ్రెడ్‌కి ఇరువైపులా కొంచెం రవ్వ చల్లి అప్పడాల కర్రతో సన్నగా వత్తి వాటిని కాగుతున్న నూనెలో వేసి.. బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించి తీసేయాలి. అంతే వెజిటబుల్ శాండ్విచ్ రెడీ.. దీనిని ఏదేని సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.