కావలసిన పదార్థాలు : శనగపిండి... 300 గ్రా. పొట్టు తీయని గోధుమపిండి.. 50 గ్రా. రీఫైన్డ్ గోధుమపిండి.. 50 గ్రా. నూనె.. 40 గ్రా. ఉప్పు.. తగినంత వాము.. ఒక టీ. జీలకర్ర పొడి.. ఒక టీ. కొత్తిమీర తరుగు.. 50 గ్రా.
తయారీ విధానం : శనగపిండి, గోధుమపిండి, రీఫైన్డ్ గోధుమపిండిలను కలుపుకోవాలి. ఇందులో నూనె, ఉప్పు, వాముపొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లుపోసి కలపాలి. ఈ పిండి మిశ్రమాన్ని అరగంటసేపు నానబెట్టాలి. తరువాత పిండిని చిన్న చిన్న బాల్స్‌లాగా చేసుకుని తరిగిన కొత్తిమీర చల్లి రోటీల్లాగా రుద్దాలి.
అలా మొత్తం చేసుకున్న తరువాత.. మైక్రోవేవ్ ఓవెన్లోగానీ, పెనంమీదగానీ వేసి కాల్చుకోవాలి. అంతే బేసన్ కీ మిస్సీ రోటీలు తయారైనట్లే..! వీటిని వేడిగా ఉన్నప్పుడు ఏదేని సాస్‌తో ఈవెనింగ్ స్నాక్స్‌గా తినవచ్చు.