కావలసిన పదార్థాలు : గుడ్లు.. నాలుగు బంగాళాదుంప.. ఒకటి ఉల్లికాడలు.. ఒక కట్ట టొమోటో.. ఒకటి మిరపకాయ.. పెద్దది ఒకటి ఉప్పు.. తగినంత మిరియాలపొడి.. సరిపడా నూనె లేదా వెన్న.. తగినంత
తయారీ విధానం : గుడ్ల సొనను బాగా గిలకొట్టాలి. ఉల్లికాడ, మిరపకాయలను తరిగి ఉంచాలి. టొమోటోల్లో గింజలు లేకుండా తీసివేసి ముక్కలుగా తరగాలి. బంగాళాదుంప చెక్కు తీసి సన్నని పొడవు లేదా గుండ్రటి ముక్కలుగా తరిగి ఉంచాలి. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్లో నూనె లేదా వెన్న వేసి వేడయ్యాక కూరగాయ ముక్కల్ని వేసి దోరగా వేయించాలి.
ముక్కలు వేగిన తరువాత వాటిమీద ఉప్పు, మిరియాలపొడి వేసి కలియబెట్టాలి. ఆపై గుడ్డు సొనను పోసి ముక్కలన్నింటిమీదా పరచుకునేలా చూడాలి. కాసేపు ఉడికిన తరువాత ఆమ్లెట్ చెదిరిపోకుండా మెల్లిగా రెండోవైపుకు తిప్పి బంగారువర్ణం వచ్చేదాకా కాల్చాలి. అంతే ఘుమఘమలాడే వెజిటబుల్ ఆమ్లెట్ సిద్ధమైనట్లే..!