కావలసిన పదార్థాలు : గోధుమపిండి.. రెండు కప్పులు పంచదార.. ఒక కప్పు పండిన అరటిపండు.. ఒకటి మంచినీళ్లు.. ఆరు టీ. వెన్న.. నాలుగు టీ. యాలకుల పొడి.. రెండు టీ.
తయారీ విధానం : గోధుమపిండిలో పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి నీళ్లు కొంచెం కొంచెంగా చల్లుతూ బాగా కలపాలి. తరువాత కాసేపు పిండిని మృదువుగా మర్దనా చెయ్యాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. తరువాత వీటిని ప్లాస్టిక్ కవర్మీద నెయ్యిరాసి చిన్న పూరీల్లా వేళ్లతోనే మందంగా వత్తి నూనె లేదా నేతిలో వేయించి తీయాలి. నూనె లేకుండా కావాలనుకుంటే మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచి దోరగా ఫ్రై చేసుకోవచ్చు. వీటిని చల్లారిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటాయి.