క్రైస్తవునికి ప్రతిదినం ప్రార్థనే ఊపిరి.. ప్రార్థన ఓ శక్తి..!

FILE
నిజ క్రైస్తవునికి ప్రతిదినం ప్రార్థనే ఊపిరిలాంటిది... ఒక భక్తుడు "నేను ఉదయం పూట ప్రార్థించని దినమున తల గొరిగించుకున్న సంసోను వలె ఉంటాను అన్నాడు. పరి.పౌలు మనము సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తం - అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం, రాజులు, అధికారులకోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు యాచనలను, కృతజ్ఞతా స్తుతులను చేయవలెను;(1.తిమోతి-2:1,2) అని రాసెను.

ఈ భూమి పాపంతో భారమైనప్పటికీ ఇంకా వేడితో దహించకుండా ఉండేందుకు పరిశుద్దుల ప్రార్థనలే కారణం. ప్రార్థన ఒక గొప్ప ఆధిక్యత, ఆయుధం, శక్తి, మార్గం.

నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది. అబ్రహాం, మోషే, ఏలియా, హన్నా, ఏస్తేరు మన ప్రభుయేసు ప్రార్థనలు పరిస్థితులనే మార్చాయి.

పశ్చాత్తాప ప్రార్థన రక్షించును. స్వస్థపరుచును. యుద్దములు మాన్‌పును, సువార్త ద్వారములు తెరుచును. ప్రసవ వేదనతో కూడిన కన్నీటి మొర త్వరగా పరము చేర్చును. ఆత్మ ద్వారం తెరిచేది ప్రార్థనయే.

వెబ్దునియా పై చదవండి