కావలసిన పదార్థాలు : నీరు... ఆరు కప్పులు నిమ్మముక్కలు... మూడు ఆరెంజ్ ముక్కలు... మూడు పుదీనా కాడలు... నాలుగు పంచదార... సరిపడా
తయారీ విధానం : ఒక గాజు జగ్‌లో నీటితోపాటు నిమ్మముక్కల్ని, ఆరెంజ్ ముక్కల్ని, పుదీనా ఆకుల్ని వేసి రిఫ్రిజిరేటర్లో కనీసం రెండున్నర గంటలసేపు ఉంచాలి. దీనిని 6 లేదా 8 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచితే మరింత రుచిగా ఉంటుంది. దీనికి తగినంత చక్కెర కలుపుకుని ఐస్‌క్యూబ్స్ వేసి తాగితే చాలా రుచిగా ఉంటుంది.