"కస్టర్డ్ మ్యాంగో డిలైట్" ఎంత చల్లగా ఉంటే అంత రుచి..

FILE
కావలసిన పదార్థాలు :
మామిడిపండ్లు... మూడు
కస్టర్డ్ పౌడర్... మూడు టీ.
యాలకుల పొడి... రెండు టీ.
పంచదార... తగినంత
పిస్తాపప్పు... మూడు టీ.
పాలు... తగినన్ని
క్రీం.... కావాల్సినంత

తయారీ విధానం :
ముందుగా మామిడిపండ్ల గుజ్జును పీచు లేకుండా తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలలో కస్టర్డ్ పౌడర్, పంచదార వేసి ఉండలు కట్టకుండా కలపాలి. ఈ పాలను స్టవ్‌పై పెట్టి సన్నని మంటమీద గరిటెతో తిప్పుతూ ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. దింపేముందు యాలకులపొడి వేసి బాగా కలియబెట్టి దించాలి.

తరువాత మ్యాంగో గుజ్జును బాగా గిలక్కొట్టి కస్టర్డ్ మిశ్రమంలో కలపాలి. తరువాత దానికి క్రీం చేర్చి, బాగా కలిపిన తరువాత ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలి. తరువాత పిస్తా పప్పును సన్నగా కత్తిరించి మ్యాంగో డిలైట్ మీద చల్లి చల్లగా అతిథులకు సర్వ్ చేయాలి. ఈ మ్యాంగో డిలైట్ ఎంత చల్లగా ఉంటే అంత రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి