కావలసిన పదార్థాలు : పంచదార... ఒక కేజీ ఐసింగ్ షుగర్... పావు కేజీ జిలాటిన్... 60 గ్రా. వెనీలా ఎసెన్స్... రెండు టీ.
తయారీ విధానం : ఒక గిన్నెలోకి జిలాటిన్‌ను తీసుకుని దాంట్లో నీరుపోసి బాగా కలిపి నానబెట్టాలి. అది నీటిని పీల్చుకుని గట్టిపడుతుంది. తరువాత ఒక పళ్ళెంలో నీరుపోసి సన్నని మంటపై ఉంచి దాంట్లో జిలాటిన్ ఉన్న గిన్నెను పెట్టి వేడిచేస్తే అది కరుగుతుంది. కరిగిన జిలాటిన్‌లో పంచదార పోసి తీగలాగా స్పూన్‌నుంచి మిశ్రమం జారేంతదాకా ఉడికించాలి.
ఆ తర్వాత గిన్నెను దించి దాంట్లో రెండు టీస్పూన్ల వెనీలా ఎసెన్స్‌ను వేసి, ఎగ్‌బీటర్ గట్టిపడేలా కొట్టాలి. దాన్ని మూడు భాగాలుగా చేసి.. ఒక భాగానికి పింక్ కలర్, మరో భాగానికి ఎల్లో కలర్ వేసి కలిపి ఉంచాలి. ఒక ట్రేలో ఐసింగ్ షుగర్‌ను, కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ను చల్లి ఎల్లోకలర్ జిలాటిన్‌ను పోయాలి.
దానిపై రంగు కలపని జిలాటిన్‌ను ఉంచి, దానిపై పింక్ జిలాటిన్‌ను పోసి 5 నుంచి 6 గంటలపాటు కదపకుండా ఉంచాలి. మిశ్రమం బాగా గట్టిపడిన తరువాత స్క్వేర్ బిట్స్‌లాగా కట్ చేసుకుని మళ్లీ కార్న్‌ఫ్లోర్, ఐసింగ్ షుగర్ మిశ్రమంలో దొర్లించి సర్వ్ చేయాలి. అంతే మాషే మెలోస్ రెడీ అయినట్లే...!