కావలసిన పదార్థాలు : బ్రెడ్ ముక్కలు.. పది కోడిగుడ్లు.. రెండు పంచదార.. అర కప్పు కిస్మిస్.. అర కప్పు పాలు.. ఒకటిన్నర కప్పు వెన్న.. రెండు టీ. కొబ్బరితురుము.. అర టీ. వెనీలా ఎసెన్స్.. అర టీ.
తయారీ విధానం : ముందుగా పాలల్లో పంచదార వేసి బాగా కలిపి.. మరిగించి, చల్లార్చాలి. కోడిగుడ్లను పగులగొట్టి పాలల్లో వేసి వెనీలా ఎసెన్స్‌ను కూడా కలిపి బాగా చిలకాలి. బ్రెడ్ ముక్కల్ని ఎర్రగా కాల్చి పైన వెన్న రాయాలి. ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని పైన కిస్మిస్లను పరిచి పైన మరో బ్రెడ్ ముక్కతో మూసివేసి అలాగే పాలల్లో ఉంచాలి.
మొత్తం అన్నీ ఆలా చేసిన తరువాత పాలు ఉన్న గిన్నెను మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచి 325 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత వద్ద 45 నిమిషాలపాటు బేక్ చేసి తీసివేయాలి. తరువాత పైన కొబ్బరికోరును చల్లి మళ్లీ ఓవెన్లో రెండు నిమిషాలు ఉంచి తీసివేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే బ్రెడ్ ఫుడ్డింగ్ రెడీ..!