కావలసిన పదార్థాలు : తామరతూళ్లు.. 200 గ్రా. నూనె.. 3 టీ. కార్న్‌ఫ్లోర్.. 2 టీ. నూనె.. తగినంత థాయ్ రెడ్ కర్రీ పేస్ట్.. 2 టీ. టొమోటో ప్యూరీ.. 2 పెద్ద టీ. ఉప్పు.. తగినంత
తయారీ విధానం : తామరతూళ్లను సన్నటి ముక్కలుగా కోసుకోవాలి. వాటిలో ఉప్పు, కార్న్‌ఫ్లోర్ కలిపి కాగుతున్న నూనెలో వేసి కరకరలాడేలా వేయించి తీసేయాలి. బాణలిలో 2 టీస్పూన్ల నూనె వేసి అందులో థాయ్ రెడ్ కర్రీ పేస్ట్ వేసి ఒక నిమిషంపాటు వేయించాలి. ఆ తరువాత టొమోటో ప్యూరీని కూడా అందులో కలపాలి. చివరగా వేయించి తామరతూళ్ల ముక్కలను కలిపి స్టార్టర్‌గా సర్వ్ చేయాలి. అంతే కరకరలాడే లోటస్ స్ట్యూ ఇన్ రెడ్ పేస్ట్ తయార్..!