థాయ్ చికెన్ కర్రీ తయారు చేయడం ఎలా... ?

బుధవారం, 27 మార్చి 2013 (11:57 IST)
FILE
చికెన్ తింటే ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. చికెన్‌లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుందని, ఇది శరీరంలో రక్త ప్రసరణను క్రమబద్దీకరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎముకలకు, నరాలకు, కండరాలకు ఎంతో మేలు చేసే చికెన్ వారినికి రెండుసార్లైనా తినాలని వారు చెబుతున్నారు. ఓకే చికెన్‌తో ఎప్పుడూ గ్రేవీలు, కర్రీలు కాకుండా థాయ్ కర్రీని ట్రై చేసి చూడండి.

కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ చికెన్ : 190 గ్రాములు
రెడ్ కర్రీ పేస్ట్ - 20 గ్రాములు
కోకోనట్ క్రీం - 30 గ్రాములు
తులసి ఆకులు - 15 గ్రాములు
చింతపండు రసం - 20 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :
ముందుగా చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక మూకుడులో వేయించుకోవాలి. దానిమీద కర్రీ‌పేస్ట్ వేసి మళ్లీ వేపుకోవాలి. అందులో చింతపండు నీళ్ళు పోయాలి. తులసి ఆకులు వేసి తర్వాత అరగరిటెడు నీళ్ళు పొయ్యాలి. తర్వాత కొబ్బరి క్రీం, ఉప్పు వేసి ఉడికించాలి. అలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్ కర్రీ రెడీ అయినట్లే. ఈ కర్రీని రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి