నూడుల్స్ కబాబ్స్: ఈవినింగ్ స్నాక్స్‌గా ట్రై చేయండి

మంగళవారం, 29 జనవరి 2013 (18:05 IST)
FILE
ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.. అదీ పిల్లలకు నచ్చే విధంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే వెంటనే నూడుల్స్... కబాబ్స్ తయారు చేయండి.

కావాల్సిన పదార్థాలు:
నూడుల్స్ - కప్పు
పచ్చిమిర్చి - నాలుగు,
అల్లం వెల్లుల్లి మిశ్రమం - చెంచా
గరం మసాలా - అరచెంచా
ఉప్పు - రుచికి సరిపడా
మొక్కజొన్న పిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూను
మైదా - రెండు పెద్ద చెంచాల
జీలకర్ర - అరచెంచా
కారం - కొద్దిగా
ఉల్లిపాయముక్కలు - అరకప్పు
పసుపు - చిటికెడు.

తయారు చేయు విధానం :
ముందుగా నూడుల్స్‌లో పసుపు, కారం, తగినంత ఉప్పు, గరంమసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి బాగా కలపాలి. వీటిని పొడుగ్గా కబాబ్స్‌లా చేసుకోవాలి. తర్వాత మొక్కజొన్నపిండి, మైదాలో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లతో బజ్జీ పిండిలా జారుగా కలుపుకోవాలి.

అటుపిమ్మట సిద్ధం చేసుకున్న నూడుల్స్ కబాబ్స్‌ను అందులో ముంచి కాగుతున్న నూనెలో వేయాలి. ఇవి బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది. వీటిని హాట్ హాట్‌గా టమోటా సాస్‌తో సర్వ్ చేస్తే పిల్లలు లొట్టలేసుకుని మరీ తింటారు.

వెబ్దునియా పై చదవండి