ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉండే "డ్రైడ్ ఫ్రూట్ స్ప్రెడ్"

కావలసిన పదార్థాలు :
ఎండు ఖర్జూరాలు... 200 గ్రా.
ఎండు ఫిగ్ పండ్లు... వంద గ్రా.
ఎండుద్రాక్ష... మూడు టీ.
దాల్చిన చెక్క పొడి... అర టీ.
జాజికాయ... పావు టీ.
కమలారసం... 200 గ్రా.

తయారీ విధానం :
కమలారసం మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ సాస్‌పాన్‌లో వేసి సగం మునిగేదాకా నీటిని పోసి సన్నటి మంటపైన ఇరవై నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత కమలారసం కూడా పోసి మూతపెట్టి రెండు నిమిషాలు ఆగాక స్పూన్ లేదా ఫోర్కుతో ఉడికించిన పండ్లను మెదిపి, కిందికి దించేయాలి.

వెంటనే ఆ మిశ్రమాన్ని ఓ శుభ్రమైన పాత్రలోకి ఒంపి చల్లార్చాలి. పూర్తిగా చల్లారిన తరువాత దీనిని ఫ్రిజ్‌లో ఉంచి అవసరమైనంత తీసి వాడుకోవచ్చు. ఇష్టమైతే ఈ పదార్థం పైన సన్నగా కట్ చేసిన డ్రై నట్స్‌ను చల్లి సర్వ్ చేయవచ్చు. అంతే డ్రైడ్ ఫ్రూట్ స్ప్రెడ్ రెడీ అయినట్లే..!

ఈ పదార్థాన్ని పిల్లలు, పెద్దలు బ్రేక్‌ఫాస్ట్‌గాగానీ... మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో స్నాక్స్‌లాగా కానీ తీసుకోవచ్చు. ఇది రోటీల్లోకి మంచి కాంబినేషన్. పాలు లేదా మజ్జిగలో కూడా దీన్ని కలుపుకుని తీసుకోవచ్చు. అలాగే బ్రెడ్‌తో కలిపి శాండ్‌విచ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలైతే అలాగే తినేందుకు ఇష్టపడతారు కాబట్టి, వారికి అలానే ఇవ్వడం మంచిది. ఇకపోతే ఇందులో ఐరన్, ఫైటోకెమికల్స్ సమృద్ధిగా లభిస్తాయి.

వెబ్దునియా పై చదవండి