ఫ్రూట్స్ స్పెషల్... "మిక్స్‌డ్ ఫ్రూట్స్ బ్రెడ్ కస్టర్డ్"

కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లయిస్‌లు... పది
కమలా రసం... 150 మి.లీ.
పాలు... అర లీ.
కస్టర్డ్ పౌడర్... రెండున్నర టీ.
పంచదార పొడి... 75 గ్రా.
మిక్స్‌డ్ ఫ్రూట్స్ (మామిడి, అనాస, ఆపిల్, కివీస్, ద్రాక్ష, స్ట్రాబెర్రీ)... 400 గ్రా.

తయారీ విధానం :
కస్టర్డ్ పౌడర్‌ని రెండు టీస్పూన్ల పాలలో ఉండలు కట్టకుండా కరిగించి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన పాలలో పంచదారపొడి వేసి వేడి చేయాలి. పాలు మరుగుతుండగా కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి చిక్కబడ్డాక, దించి దగి ఉష్ణోగ్రత వద్దకు వచ్చేదాకా చల్లబరచాలి. తరువాత పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కస్టర్డ్ మిశ్రమాన్ని, పండ్ల ముక్కలను విడివిడిగా ఫ్రిజ్‌లో ఉంచాలి.

తినేందుకు ముందు సర్వింగ్ బౌల్స్‌లో కొంత కస్టర్డ్ మిశ్రమం వేసి, పైన ఒక బ్రెడ్ స్లయిస్‌ను ఉంచి, అది నానేలా పైన కమలా రసం వేయాలి. మళ్లీ కాస్తంత కస్టర్డ్ మిశ్రమాన్నిబ్రెడ్ పైన పోసి పైన తరిగిన పండ్ల ముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే ఫ్రూట్స్ స్పెషల్ తయారైనట్లే...!

వెబ్దునియా పై చదవండి