కావలసిన పదార్థాలు : మైదా... నాలుగు కప్పులు పెరుగు... ఒక కప్పు బేకింగ్ సోడా... అర టీ. నెయ్యి... అర కప్పు ఉప్పు... తగినంత బంగాళాదుంపలు.. మూడు జీలకర్రపొడి.. ఒక టీ. గరంమసాలా... అర టీ. నూనె... మూడు టీ. ఉప్పు... తగినంత
తయారీ విధానం : బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక ఈ చిదిమిన దుంపలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత గరంమసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి తక్కువ మంటమీద ఓ ఐదు నిమిషాలు వేయించి దించాలి.
మైదాలో ఉప్పు, బేకింగ్‌సోడా వేసి కలపాలి. తరువాత పాలు, నెయ్యి, పెరుగు వేసి నెమ్మదిగా కలపాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చల్లాలి. పిండి కలుపుకున్న తరువాత తడిబట్ట కప్పి 2 గంటలు ఉంచాలి. ఆపై పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, ఒక్కోదాన్ని చిన్న పూరీలాగా వత్తాలి. వాటిలో పైన తయారు చేసిన దుంపల స్టఫ్‌ను అందులో పెట్టి అంచులను మూసివేసి చపాతీల్లాగా వత్తాలి. వీటిని వేడి పెనంమీద నెయ్యితో ఎర్రగా కాల్చితే కుల్చాలు రెడీ...!