కావలసిన పదార్థాలు : మైదా... వంద గ్రా. కోడిగుడ్డు... ఒకటి క్యాప్సికమ్... ఒకటి మిరియాలపొడి... అర టీ. ఉప్పు... తగినంత లేత మొక్కజొన్న గింజలు... 150 గ్రా. నూనె... వేయించేందుకు సరిపడా మంచినీళ్లు... 50 మి.లీ.
తయారీ విధానం : మైదాను జల్లించి అందులో కోడిగుడ్డు, ఉప్పు, మిరియాలపొడి, మంచినీళ్లు కలిపి బజ్జీ పిండిలా చేయాలి. ముక్కలుగా తరిగిన క్యాప్సికమ్, పచ్చిమిర్చి, మొక్కజొన్న గింజలు, కొత్తిమీర కలపాలి. బాణలిలో నూనె పోసి కాచాలి. చిన్న గరిటెతో పిండిని తీసుకుని చిన్న చిన్న వడల్లా వేసి ఎర్రగా వేయించి తీయాలి. అంతే కార్న్ ఫ్రిట్టర్స్ తయారైనట్లే..! వీటిని టొమాటో సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.