కావలసిన పదార్థాలు : క్యారెట్... పావు కిలో బీన్స్... పావు కిలో ఉల్లిపాయలు... వంద గ్రా. మిరియాలు... పది గ్రా. అల్లం... 50 గ్రా. బార్లీపౌడర్... వంద గ్రా. నీరు... 12 కప్పులు వెల్లుల్లి... 40 గ్రా. క్యాప్సికం... 200 గ్రా. నిమ్మచెక్క... ఒకటి.
తయారీ విధానం : కూరగాయలను సన్నగా చిన్న సైజు ముక్కలుగా తరిగి ఉంచాలి. ఓ గిన్నెలో 2 టీస్పూన్ల నూనె వేసి అల్లం, ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాక కూరగాయల ముక్కలు కూడా వేసి కాస్త వేగాక నీళ్లు పోసి మరిగించాలి. మరీ మెత్తగా కాకుండా కొట్టిన మిరియాల పొడిని కూడా వేయాలి. తరువాత కాసిని చల్లని నీళ్లలో కలిపిన బార్లీ పొడి కూడా వేసి, ఉప్పు సరిచూసి కాస్త గంజిలా తయారవగానే నిమ్మరసం పిండి వేడిగా వడ్డించాలి.