వర్షాకాలం వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు బజ్జీలు, గారెలతో సరిపెట్టుకోకుండా జీడిపప్పు చికెన్ ఫ్రై ట్రైచేసి చూడండి. క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు పోరాడే జీడిపప్పు, బరువు నియంత్రించే చికెన్‌తో జీడిపప్పు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం...
తయారీ విధానం :
శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలకు ఉప్పు, పసుపు, పెరుగు, అల్లంవెల్లుల్లిముద్ద, ఉల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ పట్టించి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించి దించేయాలి. ఆరిన తర్వాత బాణలిలో నూనె పోసి కారం, చికెన్ ముక్కలు వేసి మీడియం మంటమీద వేయించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత గరంమసాలా చల్లి, ఉప్పు సరిచూడాలి. విడిగా ఓ చిన్న పాన్‌లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు వేసి వేయించిచికెన్‌ముక్కల్లో కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేయాలి.