సంయుక్త మీనన్ మాట్లాడుతూ – ఆకర్షణీయ నగరం విశాఖపట్నంలోని ప్రజలకు అందం, ఆరోగ్యం అందించేందుకు కలర్స్ హెల్త్ కేర్ 2.Oను పరిచయం చేయడం గర్వకారణంగా ఉంది. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వెయిట్ లాస్‌కు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. హెల్తీ బాడీ అంటే సరైన మజిల్స్ ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది. ఇటీవల ట్రెక్కింగ్ కోసం మేఘాలయా వెళ్లాను. ఆ జర్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. బ్రీతింగ్ సమస్య కూడా లేదు. కానీ అక్కడ కొంత మందిలో సరిగ్గా బ్రీతింగ్ లేదు, ఆరోగ్యం సహకరించలేదు. ప్రపంచంలోని పలు ప్రదేశాలను చూడాలి, ప్రకృతిని ఎంజాయ్ చేయాలంటే హెల్త్‌ను మెంటాయిన్ చేయాలి.