మాధవ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ లో మాధవ్ ఇంటెన్స్, రగ్గడ్ లుక్ లో ఆకట్టుకున్నారు. మాధవ్ కబడ్డీ కోర్ట్ లో అడుగుపెడుతున్నట్లుగా ప్రజెంట్ చేసిన గ్లింప్స్ పవర్ ఫుల్ గా వుంది. తనని ఫెరోషియస్ గా ప్రజెంట్ చేసిన తీరు అదిరిపోయింది. విజువల్స్, బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్ వున్నాయి.
ఈ చిత్రంలో మాధవ్ సరసన దీపా బాలు కథానాయిక గా నటిస్తోంది. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్.రూప లక్ష్మి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. దేవ్ రాథోడ్ ఎడిటర్, రాజ్‌కుమార్ మురుగేశన్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, V.S.రూపా లక్ష్మి