ఉప్పు - అరచెంచా
నూనె - సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా ఓట్స్‌ను వేయించుకుని పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో 2 స్పూన్ల నూనె వేడిచేసి క్యాప్సికం మినహా మిగిలిన కూరగాయముక్కలు, సగం ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఆపై కొద్దిగా వేగాక అందులో కొబ్బరి తురుము చేర్చుకోవాలి. ఈ మిశ్రమంలో ఓట్స్ పొడి, ఉప్పు కలిపి నీళ్లు చల్లి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్నవాటిని నూనెలో వేయించుకోవాలి.
నూనె ఎక్కువగా వద్దనుకుంటే ఆవిరిమీద కూడా ఉడికించుకోవచ్చు. ఆపై బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి మిశ్రమం, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, తరుగు, అజినోమోటో చేర్చి వేయించి సోయాసాన్, టమోటా కెచెప్ కలుపుకోవాలి. చివరగా ఓట్స్ ఉండల్ని కూడా వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించి తీసి కొత్తిమీర చల్లుకోవాలి. అంటే ఓట్స్ మంచూరియా రెడీ.