సోంపు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది. సోంపు నూనెతో మర్దనచేస్తే కీళ్లనొప్పులూ తగ్గుతాయి. నరాలకూ స్వాంతన కలుగుతుంది. ముఖ్యంగా వేసవిలో సోంపుతో చేసిన పానీయాన్ని తాగితే వేడి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. సోంపులో కాపర్, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు.. ఏ, బీ, సీ, ఇ విటమిన్లు వుంటాయి.
ముందుగా పొడి చేసిన సోంపు పొడి, కచ్చాచేసిన లవంగాలు రెండు కప్పుల నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. రాత్రి నానబెట్టడం మరిచిపోతే.. రెండు గంటలు నానబెట్టినా సరిపోతుంది. తరువాత వాటిని వడగట్టి అందులో బెల్లం వేసి కలిపి ఒక గ్లాసులో షర్బత్‌ని పోసి ఐస్ ముక్కలు వేసుకుంటే సోంపు షర్బత్ రెడీ అయినట్లే.. ఇందులో మిరియాలు లేదా ఏలక్కాయలు లేదా నిమ్మరసం కలిపితే బాగుంటుంది.