వేసవిలో లభ్యమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మామిడి, తాటిముంజలు తప్పక డైట్‌లో చేర్చుకోవాలి. తాటిముంజలు వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. చికెన్ పాక్స్‌తో బాధపడేవారు తాటి ముంజలు తింటే శరీర తాపం తగ్గుతుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి. తాటి ముంజలు తీసుకోవడం ద్వారా తినడం వల్ల బరువు తగ్గుతారు. తాటిముంజల్లో నీటిశాతం అధికంగా వుండటం ద్వారా ఆరోగ్యానికి కావలసిన తేమను అందుస్తుంది.
తాటిముంజల్లో ఐరన్, క్యాల్షియం వీటిల్లో పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ, బి, సిలతో పాటు జింక్, పొటాషియం, ఫాస్ఫరస్‌లు కూడా అధికంగా ఉంటాయి. వేసవిలో రోజూ తాటి ముంజలు తింటే వడదెబ్బ తగలనీయకుండా బయటపడవచ్చు. గర్భిణీ మహిళలకు జీర్ణక్రియను తాటి ముంజలు మెరుగుపరుస్తాయి. ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తాయి.