ఒక పాత్రలోకి... పాలు, దాల్చిన చెక్క, నిమ్మచెక్క (వట్టి రసం మాత్రమే కాకుండా చెక్క మొత్తాన్ని వేసేయాలి), చక్కెర తీసుకుని కలిపి స్టౌ మీద పెట్టాలి. పాలు బాగా మరిగిన తర్వాత దించేసి, పావు గంట సేపు చల్లారబెట్టాలి. కోడిగుడ్డు సొనలో కొద్దిగా ఉప్పు వేసి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమం ఉన్న గిన్నెను చల్లటి నీళ్లు ఉన్న గిన్నెలో ఉంచితే కాసేపటికి సొన చిక్కబడుతుంది. పాలల్లోంచి దాల్చిన చెక్క, నిమ్మచెక్కలను తీసేసి కోడిగుడ్ల సొనను వేసి బాగా కలియబెట్టాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని స్టౌ పై ఉంచి, సన్నటి మంట మీద స్పూనుతో కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడి స్పూనుకు అంటుతున్నప్పుడు దించేసుకుని క్రీమ్ కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. గట్టిగా అయిన తర్వాత తీసి మిక్సీలో రుబ్బుకోవాలి. మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టాలి. ఇలాచేయటం వల్ల ఐస్‌క్రీమ్ మెత్తగా, మృదువుగా తయారవుతుంది. ప్రీజర్‌లోంచి తీసి రుబ్బి, మళ్లీ ప్రీజర్‌లో పెట్టి మళ్లీ రుబ్బి... ఇలా రెండు లేదా మూడుసార్లు చేసిన తర్వాత, చివర్లో కప్పులలో పోసి డీప్‌లో పెట్టాలి. అంతే స్పానిష్ స్పెషల్ ఐస్‌క్రీమ్ రెడీ అయినట్లే..!