బయట ఎండలు మండిపోతున్నాయి. ఎండవేడికి శరీరంలో నీరంత చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. దాంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. దాంతో పాటు, చర్మ సమస్యలు, వడదెబ్బ, డయేరియా వంటి సమస్యలు అధికం అవుతాయి. వీటి బారీ నుండి మన శరీరాన్ని రక్షించుకోవాలంటే వేసవిలో చల్లచల్లగా ఏదైనా కూల్ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.
వేసవిలో శరీరంలో నీటిని బ్యాలెన్స్ చేయడానికి కీరదోసకాయ బాగా సహాయపడుతుంది. డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. వేసవికి జింజర్, కుకుంబర్ జ్యూస్ ఫర్ ఫెక్ట్ సమ్మర్ డ్రింక్‌గా పనిచేస్తుంది. మన శరీరాన్ని చల్లబరుస్తుంది. అల్లం అనేక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. మరి ఈ రెండింటిని ఉపయోగించి జ్యూస్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం...
తయారుచేయు విధానం:
ముందుగా అల్లం మరియు కీరదోసకాయకు పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్‌ను ఒక పెద్ద బౌల్లో వేసి అవసరం అయినన్ని నీళ్ళుపోసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో బ్లాక్ సాల్ట్, పంచదార మరియు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే జ్యూస్ గ్లాసుల్లో పోసి, వెంటనే సర్వ్ చేయాలి. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ వేసవి తాపాన్నితీర్చుతుంది. శరీరానికి చల్లదనం అందిస్తుంది.