కావలసిన పదార్థాలు : ఉడికించిన బఠాణీలు.. అర కప్పు ఆలూ తురుము.. రెండు కప్పులు కారం.. ఒక టీ. మైదా.. రెండు టీ. సేమ్యా.. ఒక కప్పు కొత్తిమీర తరుగు.. పావు కప్పు ఉల్లి తరుగు.. రెండు కప్పులు
తయారీ విధానం : ఆలూ, ఉల్లి, బఠాణీల తురుములలో కొద్దిగా నీటిని కలిపి ముద్దలా చేసుకొని, ఆ పిండితో చిన్న చిన్న రోల్స్‌గా చేసి వాటిని మైదాపిండిలో పొర్లించాలి. ఆపై వాటిని సేమ్యాలో కూడా వేసి అటూ ఇటూ తిప్పి చుట్టూ బాగా అంటుకునేటట్లు చూడాలి. తరువాత ఆ తరువాత రోల్స్‌ను బాగా కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. వీటిని గ్రీన్ చట్నీ లేదా టొమోటో సాస్‌తో కలిపి తినవచ్చు.