ఎసెన్స్ పాలతో "థాయ్‌లాండ్ ఐస్‌క్రీమ్"

FILE
కావలసిన పదార్థాలు :
కొబ్బరి పాలు... రెండు గ్లాసులు
మామిడి ముక్కలు... మూడు
ఫ్రెష్ క్రీమ్... 1/4 కప్పు
పంచదార పౌడర్... అరకప్పు
కస్టర్డ్ పౌడర్... నాలుగు టీస్పూన్లు
పాలు... రెండు గ్లాసులు

తయారీ విధానం :
కస్టర్డ్ పౌడర్‌ను బాగా కలిపి అందులో 1/4 కప్పు చల్లని పాలను చేర్చి బాగా మిక్స్ చేయాలి. మిగిలిన పాలను స్టౌవ్ మీద ఉంచి మరిగించాలి. ఈ కస్టర్డ్ పౌడర్‌‌ను పాలతో కలిపి కాసేపు ఉడికించి, బాగా గట్టిగా అయ్యాక దించేయాలి. మరో 1/4 కప్ చల్లని పాలతో క్రీమ్‌ను కలిపి పంచదార పౌడర్‌ను కూడా అందులో కలపాలి.

దాంట్లోనే కస్టర్డ్, మామిడి ముక్కలు, కొబ్బరి పాలు, ఎసెన్స్ పాలతో కలిపిన క్రీమ్ అన్నింటిని వేసి బాగా గిలకొట్టి, ఈ మిశ్రమాన్ని ఒక పాన్‌లో పోసి నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత తీసి సర్వ్ చేయాలి. ఈ ఐస్‌క్రీమ్‌పై మనకు నచ్చిన పండ్ల ముక్కలతో అలంకరించుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి