కావలసిన పదార్థాలు : బేబీకార్న్.. ఆరు ఉల్లిపాయలు.. రెండు మిరియాలు.. పది పసుపు.. చిటికెడు కొబ్బరిపాలు.. రెండు కప్పులు కార్న్‌ఫ్లోర్ పేస్ట్.. 4 టీ. నిమ్మరసం.. రెండు టీ.
మసాలా కోసం.. అల్లం.. చిన్న ముక్క పచ్చిమిర్చి.. 4 కొత్తిమీర.. ఒక కట్ట ఉప్పు.. తగినంత
తయారీ విధానం : బేబీకార్న్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన చెప్పిన మసాలా కోసం చెప్పుకున్న సామానులను పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని బేబీకార్న్‌కు పట్టించి పది నిమిషాలు అలాగే ఉంచాలి. పాన్‌లో నూనె వేడయ్యాక.. మిరియాలు, ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేంతదాకా వేయించాలి.
ఉప్పు, పసుపు, బేబీకార్న్‌లను కూడా వేసి కలియబెట్టి కొబ్బరిపాలను పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. తరువాత 4 కప్పుల నీటిని పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతదాకా ఉంచాలి. తరువాత మూత తీసి కార్న్‌ఫ్లోర్ పేస్ట్ కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. చివరిగా నిమ్మరసం కలిపి, కొత్తిమీర చల్లి దించేయాలి. రోటీల్లోకి, అన్నంలోకి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.