చర్మ ఆరోగ్యానికి "స్పినాచ్ పాస్తా ప్యూరీ"

కావలసిన పదార్థాలు :
పాలకూర... ఒక కప్పు
గోధుమ పాస్తా... మూడు కప్పులు
పనీర్ లేదా ఛీజ్... రెండు టీ.
ఉప్పు, మిరియాలపొడి... తగినంత

తయారీ విధానం :
పాలకూరను మిక్సర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత నీటినిపోసి పాస్తాను ఉడికించి, ఉడికాక నీటిని వంపేయాలి. స్టౌ వెలిగించి ఒక పాత్రలో పాలకూర ప్యూరీని వేసి ఉడికించాలి. అందులో ఉడికించిన పాస్తా, ఛీజ్ లేదా పనీర్ తురుము, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి, కాసేపటి తరువాత దించేయాలి. అంతే స్పినాచ్ పాస్తా ప్యూరీ రెడీ అయినట్లే...!

పాలకూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, పనీర్‌లో ఉండే క్యాల్షియం పిల్లల్లో ఎముకల బలానికి సహకరిస్తాయి. అంతేకాకుండా ఈ ప్యూరీ ద్వారా శరీరానికి తగినంత విటమిన్ ఎ అందుతుంది. ఇది చూపు మెరుగయ్యేందుకు, చర్మం ఆరోగ్యంగా మారేందుకు తోడ్పడుతుంది. పిల్లలు మిరియాలపొడిని అంతగా ఇష్టపడకపోవచ్చు కాబట్టి, టేస్ట్ కోసం తక్కువ మోతాదులో వాడితే సరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి