"చికెన్‌ కట్‌లెట్"తో పసందైన కట్‌లెట్స్..!

FILE
కావలసిన పదార్థాలు :
పాలు.. రెండు కప్పులు
మెత్తని కోడిమాంసం.. అర కిలో
కొత్తిమీర తరుగు.. నాలుగు టీ.
ఉప్పు.. సరిపడా
కార్నఫ్లోర్.. ఆరు టీ.
జాజికాయ పొడి, మిరియాల పొడి.. తగినంత
నూనె.. పావు కేజీ
కోడి గుడ్డు సొన.. నాలుగు గుడ్లది
వెన్న.. 100 గ్రాములు
రొట్టెముక్కలు.. రెండు కప్పులు

తయారీ విధానం :
వెన్నను వేడిచేసి కోడిమాంసం ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించాలి. ఆపై పాలు పోసి మరుగుతుండగా.. కొత్తిమీర, ఉప్పు, జాజికాయ పొడులను చేర్చాలి. ఓ పొంగు వచ్చేదాకా ఉడికించి దించి పక్కన ఉంచాలి. చల్లారాక కొద్ది కొద్దిగా తీసుకుని గుండ్రంగా లేదా నచ్చిన ఆకారంలో కట్‌లెట్స్‌గా చేసుకోవాలి.

తరువాత వాటిని కార్న్‌ఫోర్ల్‌లో దొర్లించి, కోడిగుడ్డు తెల్లసొనలో ఒక్కొక్కటిగా ముంచి తీశాక రొట్టె ముక్కల పొడిలో అద్ది ప్లేట్‌లో అరగంటపాటు ఉంచాలి. కాగుతున్న నూనెలో ఈ కట్‌లెట్‌ ముక్కలను వేసి, బాగా కాలాక తీసేయాలి. అంతే చికెన్ కట్‌లెట్స్ రెడీ.. వీటిని టొమోటో, గ్రీన్‌చట్నీలతో కలిపి సర్వ్ చేస్తే సరి..!

వెబ్దునియా పై చదవండి