కావలసిన పదార్థాలు: ఆపిల్స్.. ఒక కేజీ నిమ్మరసం.. ఒక టీ. పంచదార.. ఒక కేజీ ఉప్పు.. 2 టీ.
తయారీ విధానం : ముందుగా ఆపిల్స్‌ను శుభ్రంగా కడిగి చెక్కు తీసి, విత్తనాలు లేకుండా ముక్కలుగా చేసుకోవాలి. నీటిలో ఉప్పు వేసి కరిగిన తరువాత ఆ నీటిని ఆపిల్ ముక్కల మీద పోసి ఉంచాలి. ఆ తరువాత పంచదారలో నిమ్మరసం కలిపి పొయ్యిమీద పెట్టి కరగనివ్వాలి.
ఆపిల్ ముక్కలను ఉప్పు నీటిలో నుంచి తీసి పిండి, పంచదారలో వేసి ముక్కలు ఉడికేంతదాకా కలుపుతూ ఉండాలి. ముక్కలు ఉడికిన తరువాత, రసంతో సహా సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచుకుని అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు. ముఖ్యంగా బ్రెడ్‌తో కలిపి తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా..!