కావలసిన పదార్థాలు : థాయ్ రైస్ నూడుల్స్.. 200 గ్రా. ప్యాడ్ థాయ్ సాస్.. 2 టీ. నిమ్మ ఆకులు.. మూడు నిమ్మగడ్డి తరుగు.. ఒక టీ. ఎండుమిర్చి.. రెండు పొట్టుతీసిన పల్లీలు.. వంద గ్రా. నూనె.. 4 టీ. ఉప్పు.. తగినంత
తయారీ విధానం : థాయ్ రైస్ నూడుల్స్‌ను ఉప్పు కలిపిన నీటిలో వేసి ఉడికించి.. ఆపై నీరు లేకుండా వార్చుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఎండుమిర్చి వేసి వేయించాలి. అందులోనే నిమ్మ ఆకులు, నిమ్మగడ్డి తరుగు కూడా వేసి రెండు లేదా మూడు నిమిషాలపాటు వేయించాలి. ఆ తరువాత మంట తగ్గించి ఉడికించిన నూడుల్స్‌ను అందులో వేసి కలపాలి. తరువాత ప్యాడ్ థాయ్ సాస్‌ను కూడా వేసి బాగా కలపాలి. చివరిగా పల్లీలను వేసి ఏదేని కర్రీతో సర్వ్ చేస్తే.. థాయ్ రైస్ నూడుల్స్ రెడీ..!!