కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు... అర కేజీ నెయ్యి... వేయించేందుకు సరిపడా బాదంపప్పు... పది ఉప్పు... తగినంత పెరుగు... ఐదు టీ. కుంకుమపువ్వు... 4 రేకలు అల్లం వెల్లుల్లి ముద్ద... రెండు టీ. మిరియాలపొడి... ఒక టీ. శెనగపిండి... నాలుగు టీ. మీగడ... ఒక కప్పు కారం... అర టీ.
తయారీ విధానం : బంగాళాదుంపల పొట్టు తీసి మందపాటి చాకుతో నాలుగైదు చోట్ల గాట్లు పెట్టాలి. తరువాత వీటిని ఉప్పు కలిపిన నీళ్లలో వేసి 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీళ్లన్నీ వంపేసి పలుచని బట్టతో తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు బాదంపప్పుముక్కల్ని బంగాళాదుంపల్లోకి గుచ్చి ఉంచాలి.
బంగాళాదుంపలకు నీళ్లు లేకుండా తీసివేసిన పెరుగు, అల్లంవెల్లుల్లి, మిరియాల పొడిలో దొర్లించి 10-12 నిమిషాలు పక్కన ఉంచాలి. తరువాత వీటిమీద నెయ్యి రాసి ఓవెన్‌లోగానీ కుక్కర్‌లోగానీ ఉడికించాలి. శెనగపిండిలో మీగడ, ఉప్పు, కారం కలిపి పలుచని మిశ్రమంలా కలిపి, ఉడికించిన బంగాళాదుంపల్ని ఇందులో ముంచి నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. అంతే సూపర్ టేస్టుతో అలరించే నవాబీ ఆలూ రెడీ..! వీటిని ఏదైనా సాస్‌తో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.