కావలసిన పదార్థాలు : క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లి, టొమాటో ముక్కలు... ఒక్కో కప్పు చొప్పున వెల్లుల్లి... రెండు పాయలు ఆలీవ్ నూనె... మూడు టీ. మాకరోని... 30 గ్రా. ఉప్పు... తగినంత ఛీజ్.... 25 గ్రా. మిరియాలపొడి... పావు టీ.
తయారీ విధానం : ముందుగా క్యాబేజీని ఆకులుగా విడదీసి అంగుళం సైజు ముక్కలుగా కోయాలి. ఇదేమాదిరిగా అన్ని కూరగాయల్నీ ముక్కలుగా కోయాలి. వెల్లుల్లిని కూడా సన్నగా తరిగి ఉంచాలి. ఓ గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లి, తరువాత టొమాటో తప్ప మిగిలిన కూరగాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించి, 4 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి.
కూరలు బాగా మెత్తగా ఉడికాయి అనుకున్న తరువాత మాకరోని, టొమాటో ముక్కలు వేసి బాగా ఉడికించాలి. చివరగా ఉప్పు సరిచూసి మిరియాలపొడి, ఛీజ్ తురుము కలిపి వేడిగా వడ్డించాలి. అంతే వెజ్ సూప్ రెడీ అయినట్లే..!