వెరైటీ బ్రెడ్ జామ్ "బనానా పప్పయా"

కావలసిన పదార్థాలు :
పండిన బొప్పాయి ముక్కలు... మూడు కప్పులు
అరటిపండు ముక్కలు... మూడు కప్పులు
చక్కెర... ఆరు కప్పులు
సిట్రిక్ ఆసిడ్... ఒక టీ.
ఎసెన్స్... తగినంత

తయారీ విధానం :
అరటిపండు, బొబ్పాయి ముక్కలను ఒక గిన్నెలో వేసి, తగినన్ని నీళ్ళుపోసి వేడి చేయాలి. అవి మెత్తగా అయిన తరువాత గుజ్జుగా చేసుకోవాలి. మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఒక స్టీలు గిన్నెలో వేసి ఉడికించాలి. ఇది ఉడుకుతుండగానే చక్కెర కూడా వేసి కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమంలో చక్కెర కరిగి చిక్కబడి, జామ్‌లాగా మారిన తరువాత సిట్రిక్ ఆసిడ్ చేర్చి, వేరే గిన్నెలోకి తీసి చల్లబడిన తరువాత ఫ్రిజ్‌లో భద్రపరచుకోవాలి. అంతే అరటి బొప్పాయి జామ్ రెడీ అయినట్లే..!

వెబ్దునియా పై చదవండి