కావలసిన పదార్థాలు పంచదార.. అర కప్పు సన్నని సేమ్యా.. అర కప్పు చిక్కని మీగడపాలు.. రెండు కప్పులు కోవా.. అరకప్పు నానబెట్టిన కిస్‌మిస్..రెండు టీ. యాలకుల పొడి.. అర టీ. క్రీమ్.. అర కప్పు
తయారీ విధానం పాలను బాగా మరిగించి అందులో సేమ్యాను చేర్చి ఉడికించాలి. ఉడికిన తరువాత అందులో యాలకుల పొడి, క్రీమ్, పంచదార, కోవాలను కలిపాలి. దాన్నంతటినీ మిక్సిలో వేసి రెండు సార్లు తిప్పి ఐస్‌క్రీమ్ ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌కు తగిన బాక్స్‌లో మిశ్రమాన్ని పోసి ఆరుగంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే సేమ్యా ఐస్‌క్రీమ్ రెడీ. ఐస్‌క్రీమ్‌ను ఫ్రిజ్‌నుంచి తీసిన తరువాత పైన కిస్‌మిస్ పండ్లతో గానీ ఉడికించిన సేమ్యాతో గానీ అలంకరించి సర్వ్ చేస్తే సూపర్బ్‌గా ఉంటుంది.