ఉడికించిన మాంసపు ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా?

FILE
ఉడికించిన మాంసపు ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి. ఉడికించిన పెద్ద పెద్ద మాంసపు ముక్కలను చిన్నగా తరిగి పాన్‌లో వెడల్పుగా సర్ది ఫ్రిజ్‌లో ఉంచి 5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్న తరువాత మూతపెట్టాలి. అలా కాకుండా గంటలపాటు మాంసపు ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే వేడిగా ఉండే సూపులు, గ్రేవీలను ముందుగా వేడి సూప్‌ను ఒక గిన్నెలో తీసుకొని చల్లని ఐస్ నీళ్ళలో ఉంచి చల్లబరచాలి. మొదటి రెండు గంటల్లో 70 డిగ్రీల ఫారెన్‌హీట్ (21 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతకు తీసుకువచ్చి, ఆ తరువాత మిగిలిన ఆరు గంటల్లో 41 డిగ్రీల ఫారెన్ హీట్‌కు (5 డిగ్రీల సెల్సియస్) తగ్గించి మూత పెట్టి నిల్వ చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి