మట్టిపాత్రలో వంట చేయడం మంచిదా? మట్టిపాత్రలో వండిన ఆహారాన్ని తీసుకుంటే కలిగే మేలేంతో తెలుసుకోవాలా? అయితే ఈ కథనం చదవండి. ఆధునికత పేరిట నాన్ స్టిక్, స్టైన్‌లెస్ స్టీల్, అల్యూమినియంతో తయారు చేసిన పాత్రలు ఎన్నో మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే నాన్ స్టిక్, అల్యూమినియం, స్టైన్‌లెస్ స్టీల్ పాత్రలను వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంకా మన పెద్దలు మట్టిపాత్రలతో వండిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే ఆరోగ్యంగా ఉన్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి మట్టి పాత్రలతో వంట చేయడం ఎంతో మేలు చేస్తుంది.
మట్టిపాత్రలో వేడి సరిసమానంగా వ్యాపించడం ద్వారా ఆవిరిలోనే మీ వంటలు సగానికి సగం ఉడికిపోతాయి. తద్వారా ఆవిరిలో ఉడికిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మట్టి పాత్రలో తయారు చేసిన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
మట్టిపాత్రలో ఉప్పు, కారం, పులుపు చేర్చితే ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. అదే నాన్ స్టిక్ వంటి లోహ సంబంధిత పాత్రల్లో ఉప్పు, కారం, పులుపు చేర్చితే లేనిపోని రోగాలు తప్పవు.