* రెండు అరటి పండ్లు, కొంచెం పంచదార మిక్సిలో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఒకటిన్నర గ్లాస్ పాలు, ఒక గ్లాసు నీరు పోసి మరిగించండి. ఇందుకు మీకు నచ్చిన ఎసెన్స్ కలుపుకోండి. కొత్తరకం పాయం రెడీ.
* ఇక నీటికి బదులు పాలతో రవ్వ కేసరి చేస్తే.. పాలకోవాలా సూపర్ టేస్ట్‌ను ఇస్తుంది. బాదుషా చేసే పిండికి సోడా, డాల్డాతో పాటు కొంచెం పుల్లని పెరుగును చేర్చుకుంటే మృదువైన బాదుషాలు రెడీ. బీట్‌రూట్‌ను పాలలో ఉడికించి హల్వా చేస్తే సూపర్ టేస్ట్ ఇస్తుంది. వర్షాకాలంలో దోసెపిండి పులుపెక్కకపోతే.. కొబ్బరి నీరు చేర్చుకోండి.