ఈ వ్యక్తితో మా సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. UV క్రియేషన్స్ తరఫున వచ్చే అన్ని అధికారిక సమాచారం, కాస్టింగ్ ప్రక్రియలు నమ్మదగిన, సరైన మార్గాల ద్వారా మాత్రమే జరుగుతాయి.
ఈ విషయాన్ని పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించాలని, ఎవ్వరైనా ఈ తరహా అనామక ప్రతినిధులతో ముందుకు వెళ్లేముందు తప్పకుండా నిజం తెలుసుకోవాలని మనవి. మాకు ఏ అవసరాలు ఉన్నా లేదా కాస్టింగ్ కాల్స్ ఉన్నా, అవి అధికారికంగా, నమ్మదగిన వనరుల ద్వారా మాత్రమే తెలియజేస్తాం.