ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

దేవీ

గురువారం, 3 జులై 2025 (19:14 IST)
Raja sab - Prabhas
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో దీపికాపదుకొనే చేయనన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ మరో భామ చేయడానికి సిద్ధమైంది. కాకపోతే అది ఆ సినిమా కాదు. తాజాగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతోన్న రాజాసాబ్ లో. రాజా సాబ్ ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ రిలీజ‌య్యాక ఈ సినిమాపై మంచి బ‌జ్ నెల‌కొంది. హార్ర‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
 
రాజా సాబ్ చిత్రంలో బ్యాలెన్స్ లో ఓ స్పెష‌ల్ సాంగ్ చేయనున్నారని సమాచారం. అయితే ఈ స్పెష‌ల్ సాంగ్ లో ఏ హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంద‌నేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా తాజాగా ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ బాలీవుడ్ బ్యూటీ క‌రీనా క‌పూర్ ను తీసుకోవాలని చూస్తున్నారని తెలిసింది. పారితోషికం గురించి పీపుల్స్ మీడియా ఆలోచించడంలేదు. మరి అన్నీ సెట్ అయితే ఆమెకు భారీ పారితోషికం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  మ‌రి రాజా సాబ్ స్పెష‌ల్ సాంగ్ కు క‌రీనా క‌పూర్ ఒప్పుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.  ఇప్పటికే ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్, మాళ‌విక మోహ‌న‌న్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు