నిమ్మను భద్రపరచండి-కొబ్బరి పిప్పికి రంగులద్దండి

సోమవారం, 28 జులై 2014 (18:35 IST)
నిమ్మను భద్రపరుచుకోండిలా
నిమ్మ రసం చిటికెడు మాత్రమే కావాల్సి వచ్చినప్పుడు కాయను కట్ చేసి వేస్ట్ చేస్తుంటారు చాలా మంది. అలా చేయకుండా సూదితో దాన్ని పొడిచి కావలసినంత రసాన్ని తీసుకోవచ్చు. వీటిని పగటి పూట చల్లని నీటిలో ఉంచి రాత్రి సమయంలో బయటకు తీసి గాలి తగిలేట్టు పెడితే చాలా రోజుల వరకు చెడిపోకుండా, తాజాగా ఉంటాయి.
 
కొబ్బరి పిప్పిని ఉపయోగించండిలా
పాలు తీసేసిన కొబ్బరి పిప్పిని మీరైతే ఏం చేస్తారు పారేస్తారు. కానీ ఈ పిప్పినలా పారేయకుండా ఎండలో ఆరబెట్టి రంగులు కలిపి చూడండి. ముగ్గులు వేసేటప్పుడు రంగులుగా చక్కగా పనికివస్తాయి.

వెబ్దునియా పై చదవండి