కరివేపాకు, పచ్చిమిర్చి తాజాగా వుండాలంటే..? వేడినీటితో బియ్యాన్ని కడిగితే..?

సోమవారం, 21 నవంబరు 2016 (16:54 IST)
పచ్చిమిర్చి తొడిమలు తొలగించి గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి. వాటిపై కొద్దిగా పసుపు చల్లి మూతపెట్టేయాలి. ఇలా చేస్తే అవి ఎక్కువ రోజులు తాజాగా వుంటాయి. కూరగాయలను అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. 
 
కూరగాయలను అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. గులాబ్ జామ్ మెత్తగా రావాలంటే పిండిలో కాసిని పాలు, కొద్దిగా నెయ్యి చేర్చి కలిపితే సరిపోతుంది. పెసరట్లు కరకరలాడాలంటే పెసర్లలో గుప్పెడు బియ్యం వేసి నానబెట్టి రుబ్బాలి.
 
కడిగిన బియ్యంలో బిర్యానీ ఆకు వేయండి. అన్నం ఉడికాక ఆకు తీసేస్తే అన్నం మంచి వాసన వస్తుంది. పకోడీ పిండి కలిపేటప్పుడు శనగపిండితో పాటు చెంచా మొక్కజొన్న పిండి కూడా కలిపితే కరకరలాడతాయి. బియ్యాన్ని వేడినీటితో రెండుసార్లు కడిగితే… గంజి శాతం తగ్గుతుంది. అన్నం పొడిపొడిగా వస్తుంది. గాలి చొరని డబ్బాలో కరివేపాకును ఉంచి అందులో కొన్ని మెంతులు వేస్తే ఆకులు ఎక్కువ రోజులు తాజాగా వుంటాయి 

వెబ్దునియా పై చదవండి